Oil change karo fly karo scheme(December 16th - December 31st -2019) engine oil change sales reached 500 celebrations at Anuradhaauto -2019

 
Dec 16-2019 శ్రీకాకుళంలో AkFI ఆమెచ్చుర్ కబడ్డీ ఫెడరేషన్ ఆ ఇండియా ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొనే పురుషుల,మహిళల జట్టు సభ్యులను ఎంపిక చేసాము.శ్రీకాకుళం జిల్లా AkFI కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను నేను

 
రోటరీ క్లబ్ ద్వారా కీ.శే గొల్లపూడి మారుతిరావు గారిని సన్మానించుకొని వారి ప్రసంగం వినే అవకాశం దొరికింది..నా జ్ఞాపక దొంతరల్లో 2013 లో దసపల్ల హోటల్ లో రోటరీ కార్యక్రమం గుర్తులు

 
నా అమెరికా ప్రయాణము ముగించుకొని ఇండియా బయల్దేరాను.నాట్స్ కార్యక్రమంలో పాల్గొని అనేకమంది బంధు మిత్రులను కలుసుకున్నాను.ప్రవాసాంధ్రులకు కాలిఫోర్నియా లో చేదోడు వాదోడుగా వుండే కోమటి జయరాం గారి ఆతిధ్యం తీసుకొని న్యూ జెర్సీ వైపు అన్నింటిలో వున్నాను అందరికోసం నేను వున్నాను అనే మన్నవ మోహన్ కృష్ణ వీడ్కోలు పలుకగా తిరుగు ప్రయాణమయ్యాను

 
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరియు జన్మభూమి ఇండియా లో సేవలు అందిస్తున్న నాట్స్ సంస్థ వారు ఈ రోజు ఫిలడెల్ఫియా లో గ్లో సంస్థ ద్వారా నేను నాట్స్ వారికి అందిస్తున్న సహకారానికి ప్రత్యేకంగా నన్ను అమెరికా ఆహ్వానించి నన్ను సన్మానించారు..సంతోషం గా ఉంది.

 
02-12-2019 సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి.. నా మిత్రుడు కృష్ణ కోసం అచుతాపురం లో నేను నిర్మించిన సుబ్రహ్మణ్యస్వామి గుడిలో ఈ రోజు స్వామి కల్యాణ వేడుకలు కనుల పండుగగా జరిగాయి.వేకువ జామునే అభిషేకాలు జరిగాయి.భక్తులు కల్యాణోత్సవం లో పాల్గొన్నారు

 
స్వామియే శరణం అయ్యప్ప.(29-11-2019)విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయ్యప్ప స్వామి గుడిలో అన్న సమారాధన చేసి అయ్యప్ప దీక్షదారుల కు ప్రసాదం పంచాము..సర్వేజనా సుఖినోభావంతు

 
పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో తయారైన కారు,కియా కారు,మేడిన్ ఆంధ్రప్రదేశ్...చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం. కొడుకు కోసం కొన్నాను.ఈ రోజు కారు ఇంటికి వచ్చింది (28-11-19)

 
కేసు కొట్టేసారోచ్(Nov 25th-2019)....న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది.న్యాయ వ్యవస్థ కు వందనాలు

 
Sireesha and me are on a trip to Jamaica westindies, three days to relax , monday morning back to vizag.

 
NAREDCO National Real Estate Development Council Conducted property show at Vizianagaram on 9th and 10th NOV 2019, this is a boost to the construction and real estate industry

 
విశాఖలో మధురవాడ స్టేడియం ఎదురుగా సన్ ఫ్లవర్ స్పెషల్ స్కూల్ లో మానసిక వికలాంగులు,వినికిడి సమస్య,ఆటిజం వంటి విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులతో ప్రమిధలు ,విభిన్న ఆకృతులలో కోవొత్తులు అలంకారాలు స్కూల్ వారు తయారు చేయిస్తున్నారు.మా వ్యాపార సంస్థల్లో వారి చే చేయించిన ప్రమిధలు పంచాము. అవకాశం ఉంటే ఒక సారి ఆ స్కూల్ కి వెళ్ళండి.యాజమాన్యం కి సహాకరించ గలరేమో నని విన్నపము.ఇందులో �

 
Dear Members, appreciation certificates and mementoes are given to GITAM & PYDAH, MBA 1st year students for participating in our PROPERTY SHOW 2019 conducted in Vizag Convention , P.M.Palem, and making the event a grand sucess. NAREDCO President Sri.N.SRI NAGESH & Vice President Sri. Y.V.Choudary attended the program n wished them good luck for their bright future. Students n management's are thrilled by our reciprocity

 
భారత దేశంలో ఉన్న సుమారు 15 వేలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోల్ బంకులలో అత్యుత్తమ పని తీరు ప్రదర్శించిన 20 పెట్రోల్ బంకుల వారి అనుభవాలను తెలుసుకొని ప్రశంశించడానికి బెంగళూరు లో ఈ రోజు కార్యక్రమం చేపట్టారు.అనురాధ ఆటో మా షీలనగర్ పెట్రోల్ బంకు యజమాని అయిన మా మామగారు శివాజీ గారిని గౌరవిస్తున్నారు.

 
దసరా పూజలు చక్కగా జరిగాయి.యంత్ర పూజ వాహన పూజ చేసుకొని కొత్త ఉత్సాహం తో సిబ్బంది మేము ఉత్తేజాన్ని పొందాము. మా అనురాధ ఆటో 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31 లోకి అడుగు పెట్టింది.దుర్గమ్మ పాహిమాం

 
దసరా శరన్నవరాత్రి పూజలో భాగంగా 4 వ రోజు పూజ లో శిరీష నేను పాల్గొన్నాము.రైతులకు మంచి పంటలు పండి గిట్టుబాటు ధరలు రావాలని,వ్యాపారులకు చక్కగా వ్యాపారం జరగాలని,విద్యార్థులకు మంచి చదువులు రావాలని,వారికి మంచి ఉద్యోగాలు రావాలని ,అందరం సంతోషంగా ఉండాలని దుర్గమ్మని ప్రార్ధించడం జరిగింది

 
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా వైజాగ్ బీచ్ రోడ్లో స్వచ్ భారత్ పై ర్యాలీ నిర్వహించాము..ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్ ని నిషేదించాలి. గాంధీ ఆశయాలను సాధించే దిశగా పయనిద్దాము

 
Naredco property show at Vizag convention hall - September 2019

 
Rotary club Visakhapatnam South opening - 21st July 2019

 
CHIEF GUEST GAJUWAKA MLA SRI TIPPALA NAGIREDDY FOR INDEPENDENCEDAY AND RAKSHABANDHAN - 2019 CELEBRATIONS AT ANURADHA AUTO

 
BLOOD DONATIO CAMP AT ANURADHA AUTO

 
Vinayakachavithi celebrations at Anuradha Auto - 2019

 
NAREDCO PROPERTY SHOW IN VIZAG - 2019 CHEIF GUEST'S V.M.R .D.A CHAIRMAN SRI DRONAM RAJU SRINIVASUGARU & VISAKHAPATNAM MP SRI MVV SATYANARYANAGARU

 
సాహసం చెయ్యరా డింబకా...కోస్టారిక దేశంలో మిత్రులతో సరదాగా సాహసాలు.

 
మేఘాలని దాటి వెళ్లటం అంటే ఏమిటో భూతల స్వర్గం స్విట్జర్లాండ్ లో చూసాము...సరదా సరదాగా చలి చలిగా

 
శిరీష మరియు పిల్లలతో ఫ్రాన్స్,బెల్జియం,నేతర్లాండ్స్,జర్మనీ, స్విజార్లాండ్ దేశాలు పర్యటన లో ఉన్నాము.ఐరోపా దేశాలలో చరిత్ర చాలా ఉంది.పర్యటన చల్లగా సాగుతుంది.

 
#ఫణి_తుఫాన్ అనంతరం వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న పలాస నియోజకవర్గ సమన్వయకర్త #యార్లగడ్డ_వెంకన్న_చౌదరి_గారు, ఎంపీపీ #వసంత_స్వామి_గారు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ అధ్యక్షుడు #గోవిందా_పాపారావు_గారు వజ్రపుకొత్తూరు మండల విప్, గోవిందపురం ఎంపీటీసీ సభ్యులు #రమణడిల్లేశ్వరి_గారు, గోవిందపురం పిహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ #పుచ్చ_ఈశ్వరరావు_గారు......ాగుతుంది.

 
*పలాస మండలం / ఏప్రిల్ 05:- పలాస మండలం రాజగోపాలపురంకు చెందిన 20 మంది తెలుగుదేశం పార్టీ లోకి చేరారు*. తెలుగుదేశం పభుత్వం ప్రవేసపెట్టిన సంక్షేమ పధకాలకు ఆకర్షితులై పలాస తెలుగుదేశం సమన్వయకర్త యార్లగడ్డ#వెంకన్నచౌదరి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీలో చేరినవారిలో పైల సురేష్ ,మువ్వారి రామారావు, బమ్మిడి వైకుంఠరావు, కవిటి కనకచలం, బిర్లంగి శివయ్య, కవిటి మోహనరావు, ఎం.షణ్ముఖరావు, కామనాయుడు, గొర్ల కృష్ణారావు, వెంకటరావు, కవిటి మన్మధరావు, యవ్వారి బాలక్రిష్ణ మొదలగువారు చేరారు . వీళ్ళందరూ గౌతు శిరీష గారి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడ్డ నాగరాజు, రోనంకి రమణారావు, గిన్ని సింహాచలం పాల్గొన్నారు. — with  Venkanna Choudary Yarlagadda .ాగుతుంది.

 
ఈ రోజు పలాస నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మయ సభలో #పలాసనియోజకవర్గసమన్వయకర్త #వెంకన్నచౌదరిగారు....

 
#శిరీషమ్మ గెలుపు కై 11 వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా సమన్వయకర్త ... #వెంకన్నచౌదరిగారితో తెలుగుతమ్ముళ్లు....మీ లొడగల కామేశ్వరరావు,తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు.

 
పలాస నియోజకవర్గ సమన్వయకర్త మా *#వెంకన్న_చౌదరి_గారి* కి #జన్మదిన_శభాకాంక్షలు.....#మీప్రభు...

 
ఈ రోజు మన మున్సిపాలిటీ పరిధిలో గల ఉన్న 5 వ వార్డ్ లో ప్రచారం చేస్తున్నా జిల్ల సమన్వయకర్త #వెంకన్నచౌదిరి గారు పెద్దలు శ్రీ వజ్జ బాబురావు గారు లోడగల కామేశ్వరరావు గారు సూర్యనారయణ గారు నాగరాజు గారు నిమ్మణ బైరేగి గారు మల్ల శ్రీనువాసురావు గారు గాలి క్రీష్ణరావు గారు మల్ల క్రిష్ణ గారు అంబాటి క్రీష్టముర్తీ గారు టంకల రవి గారు మన తెలుగుదేశం ముఖ్యనాయకులు పెద్దలు పాల్గున్నారు ....... జై తెలుగుదేశం...

 
తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ నారా లోకేష్ గారి పలాస నియోజకవర్గ పర్యటనలో....

 
శిరీషమ్మ పలాస తెలుగుదేశం ఎమ్యెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా...ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రం ను అందజేస్తున్న.. మన శిరీషమ్మ*

 

 
భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని కలిసాము.డిసెంబర్ 9న విశాఖపట్నంలో జరగబోవు NAREDCO సదస్సుకు ఆహ్వానం అందచేసాము. ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ దేవేలోపేర్స్ ఉత్తరాంధ్ర జిల్లాల జనరల్ సెక్రటరీ హోదాలో ఉప రాష్ట్రపతి గారిని కలిసాను.నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించి మా మామగారు శివాజీ గారిని వారి యోగక్షేమాలు విచారించారు.

 
ఈ దీపావళికి బాణసంచా కాలచొద్దని కొందరు , కాల్చమని కొందరు,సరే ఈ గోల ఎప్పుడు ఉండేదే అని ఈ సారి విశాఖపట్నంలో సన్ ఫ్లవర్ స్పెషల్ స్కూల్ లో మానసిక వికలాంగ పిల్లల చేత 10,000 మైనము తో కూర్చిన మట్టి ప్రమీదలు చేయించి మా అన్ని పెట్రోల్ బంకులలో మా ఖాతాదారులకు పంచాము.తృప్తి అనిర్వచనీయము. అందరికి దీపావళి శుభాకాంక్షలు మీ వెంకన్న చౌదరి అనురాధ ఆటో BPCL,శిరీష పెట్రోలియం IOCL,సర్దార్ పెట్రోలియం HPCL..

 
ఢిల్లీ విశ్వవిద్యాలయం లో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న శంకర్ ఠాకూర్ భారత దేశం పచ్చగ్గా స్వచ్ఛగా ఉండాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని భావించి సైకిల్ యాత్ర చెప్పటాడు.నిన్న మా విశాఖపట్నం గాజువ్వాక లో ఉన్న పెట్రోల్ బంక్ అనురాధ ఆటో మీదుగా వెళ్తుండగా మేము మా సిబ్బంది భారత్ పెట్రోలియం అధికారి కిరణ్ కుమార్ కలసి శంకర్ ఠాకూర్ కు చిన్న సన్మానం చేసాము.

 
ఈ రోజు కడప జిల్లా రైల్వే కోడూరు పెళ్లికి వెళ్ళాను.పెళ్లి కూతురు మా చిన్నాన్న గారి అమ్మాయి.అందరం ఒకే రకమైన పొందూరు చీరలు పంచలు కట్టాము.

 
పరిటాల వారి ఇంట్లో పెళ్లి సందడి.మంత్రివర్యులు అచ్చన్నాయిడు గారి ఏర్పాట్ల చొరవతో,శ్రీకాకుళం జిల్లా ముఖ్యులు MP రామ్మోహాన్ నాయుడు,MLA భగ్గు రమణమూర్తి,MLA గుండ లక్ష్మీ దేవి,MLA బెందాలం అశోక్ బాబు గార్లు సమైక్యంగా బెంగళూరు చేరుకొని పరిటాల వారి ఇంట్లో పెళ్లి వేడుకకు తరలి వెళ్లారు.పరిటాల సునితమ్మ మమ్మలిని అందరిని సాదరంగా ఆహ్వానించారు.అత్యంత వైభవంగా చేసిన ఏర్పాట్లు అందరిని ఆకర్షించాయి.పనిలోపనిగా సినీ నటులు మోహన్ బాబు గారిని కలిసాము

 
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు గాజువాకలో ఉన్న మా పెట్రోల్ బంక్ లో పూజ పూర్తి చేసుకొని,స్వచ్ఛ భారత్ లో భాగంగా విశాఖ GVMC వారి ఆధ్వర్యంలో, మా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోల్ బంక్ అనురాధ ఆటో యజమాని శ్రీ గౌతు శివాజీ గారు, మా మిత్రుడు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మేము మా సిబ్బంది కలసి మా పెట్రోల్ బంక్ ఆవరణ చుట్టూ పక్కల స్వచ్ఛత సేవ చేసాము.

 
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దుర్గమ్మ తల్లి దీవెనలు అందరికి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.జై దుర్గ భవాని

 
నేడు విజయవాడ హోటల్ తాజ్ గేట్వే నందు ఆంధ్ర ప్రదేశ్ భారత్ పెట్రోలియం రాష్ట్ర స్థాయి డీలర్ అద్వయసరి సమావేశం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం బంకుల డీలర్లులో 16 మంది డీలర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు.ఈ రంగం లో ఉన్న సమస్యలు,ముఖ్యంగా గత కొద్దీ రోజులుగా కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు,GST సమస్యలు,డీలర్ కమిషన్,పెరిగిన పనివారాల జీతాలు వంటి ముఖ్య సమస్యలు చర్చించాము.

 
గౌరనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు సాంకేతిక శాఖమాత్యులు శ్రీ నారా లోకేష్ బాబుగారు మొదటి సారి జిల్లా విచ్చేసిన సందర్భంగా జరిగిన ఏర్పాట్లు మరియు జనసందోహాన్ని చూసి తే 19-09-2017 ది న శ్రీకాకుళం ఆర్&బి గెస్ట్ హౌజ్ లో నాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో విజయవంతం అవ్వడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదములు....

 
మన రాష్ట్ర మంత్రివర్యులు యువత ప్రతినిధి నారా లోకేష్ గారి పలాస పర్యటన ఆద్యంతం జన భరితంగా సాగింది.పలాస కాశిబుగ్గ జంట పట్టణాలు వీధులన్నీ ఇసుకేస్తే రాలనట్టు గా జన సంద్రంతో కిక్కిరిసి లోకేష్ గారికి ఆహ్వానం పలికారు.కిడ్నీ బాధిత ప్రాంతాల లో మంచినీటి సదుపాయం మదర్ ప్లాంట్ ఓపెనింగ్ లో గాని,ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సహకారం తో బెంచీలు వితరణ కార్యక్రమంలో గాని, మా కుటుంబ సన్నిహితులు మంత్రివర్యులు కింజరాపు అచ్చన్నాయిడు గారి సహకారంతో శివాజీ గారు సాధించిన మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిసర్వోయిర్ నిధులు మంజూరు విజయోత్సవ సభ జయప్రదం చేసినందుకు,కనీవినీ ఎరుగని రోడ్ షో లో పాల్గొని,కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగు దేశం కుటుంబ సభ్యులందరికి మా ధన్యవాదములు

 
పలాస నియోజవర్గం సీనియర్ శాసనసభ్యులు మచ్చ లేని నాయకులు శ్రీ గౌతు శ్యాంసుందర్ శివాజీ గారు. ఇప్పుడు ఇతని లక్ష్యం పలాస నియోజకవర్గ ప్రజలకు సాగు నీరు పలాస మున్సిపాలిటీ ప్రజలకు శాశ్వత మంచి నీరు అందివాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అందులో భాగంగా గెడ్డం దీక్ష చేపట్టారు. ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నారు. 2006 నుండి 2014 వరకు ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం 12కోట్లు ఖర్చు చేశారు గత పాలకులు. ఈ విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకొని శివాజీ గారు సంబంధిత శాఖ మంత్రి వర్యులు మీద సంబంధిత శాఖ అధికారులు పైన తీవ్ర వత్తిడి తేవడం తో ఆ ప్రాజెక్ట్ లో కదలిక వచ్చింది త్వరలో సవరించిన అంచనాలు ఆమోదం పొంది జీవో జారీ కానుంది. జై శివాజీ గారు.... జై తెలుగుదేశం........

 
శివాజీ గారి దీక్ష ముగిసింది.ఇక మహేంద్రతనాయ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసి సకాలంలో సాగు నీరు త్రాగు నీటి సమస్య పరిష్కారం కావాలని ఆ వెంకటేశ్వర స్వామికి కోరుకున్నాం.నిన్ననే తలనీలాలు,దీక్ష తో పెంచిన గడ్డం స్వామికి సమర్పించి,నేటి వేకువ ఝామున శ్రీనివాసుని దర్శించుకున్నాము.

 
మనం రొజూ ఎన్నో రాజకీయ ఛాలెంజ్ లు చూస్తూ ఉంటాం... నిన్న కాక మొన్న నంద్యాలలో చూసాం, శిల్పా అయితే ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు... జగన్ అయితే కాల్చేస్తా అన్నారు... రోజా అయితే అప్ అండ్ డౌన్ అదరాలి అంది.. చివరకి ఇలాంటి మాటల వల్ల ఏమైందో చూసాం... ముఖ్యంగా ప్రజలకు, రవ్వంత అయినా ఉపయోగం ఉండదు... పేపర్లో న్యూస్ ఐటెం కి, టీవీ లో బైట్ కి, ఫేస్బుక్ లో స్టేటస్ కి మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి.. ఇలాంటి రాజకీయ ఛాలెంజ్ లో నుంచే ఈ మధ్య కొన్ని ఛాలెంజ్స్ వస్తున్నాయి.... ఇవి ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్... మొన్నా మధ్య పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే ఆనాటి నుంచి మొన్నటి వరకు ఆయన గడ్డం తీసుకోలేదు... ఆయన చెప్పినట్టుగా పులివెందులకు నీళ్ళు తీసుకెళ్ళి, గడ్డం తీయించుకుని దీక్ష విరమించనున్నారు... ఇప్పుడు అలాంటే ఛాలెంజ్ ఇంకోటి నెరవేరబోతుంది... శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తాను చేపట్టిన గెడ్డం దీక్షను శనివారంతో ముగించనున్నారు. జిల్లాలో ఆఫ్షోర్ రిజర్వాయర్కు నిధులు మంజూరు కోసం ఆయన తన అనుచరులతో కలసి ఏప్రిల్1న దీక్ష మొదలుపెట్టారు. రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు రూ.466కోట్లు మంజూరు చేయడంతో దీక్షను విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. శుక్రవారం తిరుపతి వెళ్లి శనివారం గెడ్డం తీసివేస్తానని శివాజీ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు దోచుకోవాలి..